- Trending
- క్రేజీగా 'ధర్మస్థల నియోజకవర్గం' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు సినిమాకు భారీగా స్పందిస్తుండటంతో వసూళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తన పవర్‌ఫుల్ నటన, మాస్ అప్పీల్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టార్‌డమ్‌ను చాటుకున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని అరుదైన రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పెద్ది’ విజయోత్సాహంతో మెగా అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
“పెద్ది” జోరు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ మైలురాళ్లు అందుకోవడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.